ఉచితంగా కూడా న్యాయ సేవలు...పూర్తి వివరాలు

updated: February 20, 2018 19:25 IST

ప్రస్తుతం మధ్యతరగతి వారికి కూడా న్యాయ స్థానాలను ఆశ్రయించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంగా ఉంది. ఇందుకోసం 1976లో భారత రాజ్యాంగానికి అధికరణ 39(ఏ) జతచేసి అవసరమైన వారికి ఉచిత న్యాయం అందించటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించారు. దీని కోసం చట్టాన్ని కూడా రూపొందించారు. అదే న్యాయసేవల అధికారిక చట్టం ఇది కేంద్ర చట్టం.  న్యాయ సహాయం అందరికి అందుబాటులోకి రావాలని ఆర్థిక దుస్థితి వల్ల కాని, మరే ఇతర కారణాల వల్ల గాని న్యాయాన్ని పొందే అవకాశం కొందరికే పరిమితం కాకుండా ఉండాలని ఆ అధికరణ చెపుతోంది. 

దాంతో లాయర్ ను పెట్టుకునే స్థోమత లేకపోయినా న్యాయం జరిగేలా న్యాయస్థానాలు ఉచిత న్యాయ సేవలను అందిస్తున్నాయి. ఉచిత న్యాయ సేవలు ఏలా పొందవచ్చు..? ఎవరు దీనికి అర్హులు ..? అసలు ఫ్రీ లీగల్ ఎడ్వజ్ చట్టం ఏం చెబుతుంది.  

ఎవరు అర్హులు :

షెడ్యూల్డ్ కులం, తెగకు చెందినవారు, మానవ అక్రమ రవాణా భాధితులు, యాచకులు, స్త్రీలు, పిల్లలు, మతి స్థిమితం లేనివారు, అవిటివారు, సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు, పారిశ్రామిక కార్మికులు, వార్షిక ఆదాయం రూ. 50 వేలు మించని వ్యక్తులు ఉచిత న్యాయం సహాయం పొందడానికి అర్హులుగా

దరఖాస్తు చేయు పద్ధతి

న్యాయ సహాయం కోరుకునేవారు .. తమ కేసు పూర్వాపరాలు, కావల్సిన పరిష్కారం వివరిస్తూ అఫిడవిట్ను, సంబంధిత డాక్యుమెంటులను జత చేస్తూ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు పైన తెలిపిన అర్హతలలో తగిన ఆధారాలు పంపిచినతో నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారు.

 

దరఖాస్తు చేయవలసిన చిరునామా

ఉచిత న్యాయ సహాయం కోరుకునేవారు తమ జిల్లా కోర్టులందు గల జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు గాని, రాష్ట్ర హైకోర్టులో గల రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థకుగాని కేసుల వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకోవాలి.

 

న్యాయ సహాయ విధానాలు

1. న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట

2. కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరఫున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టుట.

3. న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులను భరించుట.

4. న్యాయ సహాయం పొందిన వారికి ఆయా కేసుల్లో జడ్జిమెంట్ల నకళ్ళు ఉచితంగా ఇచ్చుట, మొదలగు సహాయాలు అందిస్తారు.

 

మరిన్ని వివరాల కోసం ... https://nalsa.gov.in/ ను సంప్రదించవచ్చు. 

comments